ఆయన ఓ సందర్భంలో కన్నడ భాషపై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. శివరాజ్ కుమార్‌ను ఉద్దేశిస్తూ.. కన్నడ కూడా తమిళం నుండే పుట్టిందని అనడంతో కన్నడిగులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కమల్‌హాసన్ క్షమాపణలు చెప్పకపోతే థగ్ లైఫ్ సినిమాని ఆడనివ్వం అంటూ సీరియస్ అయ్యారు. పలువురు రాజకీయ నాయకులు కూడా ఈ ఇష్యూపై మండిపడ్డారు. ఈ క్రమంలో కమల్‌హాసన్ స్పందించారు. ఆ వ్యాఖ్యలు నేను కేవలం ప్రేమతో చేసిన వ్యాఖ్యలేనని.. తనకు వేరే ఉద్దేశం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. నేను ప్రేమతో అలా చెప్పాను. ఎంతోమంది చరిత్రకారులు భాషా చరిత్ర గురించి నాకు చెప్పగా, నేను అలానే అన్నాననే తప్ప నా కామెంట్స్‌లో మరో ఉద్దేశం లేదు. తమిళనాడు అరుదైన రాష్ట్రం. ఎంతో విశాల దృక్పథం కలిగింది, తమిళనాడులో కేవలం తమిళులే కాకుండా ఇతర భాషా నేపథ్యం ఉన్నవారు కూడా అత్యున్నత పదవులు అలంకరించారు. ఓ మేనన్ (ఎంజీ రామచంద్రన్) ముఖ్యమంత్రిగా చేశారు. ఓ రెడ్డి (ఒమందూర్ రామసామి రెడ్డియార్) సీఎం అయ్యారు. మైసూర్ సంస్థానంలో పనిచేసిన నరసింహన్ రంగాచారి మనవరాలు (జయలలితను ఉద్దేశిస్తూ) కూడా ముఖ్యమంత్రిగా చేశారు. చెన్నైలో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కర్ణాటక నాకు మద్దతుగా నిలిచింది. భాష అనేది చాలా సున్నితమైన అంశం. దాని గురించి మాట్లాడేందుకు రాజకీయ నాయకులు అర్హులు కారు. నిజం చెప్పాలంటే, ఆ అర్హత నాకు కూడా లేదు అంటూ కమల్‌హాసన్ చెప్పుకొచ్చారు.
- May 29, 2025
0
50
Less than a minute
Tags:
You can share this post!
editor

