మొదలైన ‘కామాఖ్య’ షూటింగ్

మొదలైన ‘కామాఖ్య’ షూటింగ్

సమైరా, సముద్రఖని, అభిరామి ముఖ్య పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న థ్రిల్లర్‌ ‘కామాఖ్య’. వడ్డేపల్లి శ్రీవాణీనాథ్‌, యశ్వంత్‌రాజ్‌ నిర్మాతలు. ఈ సినిమా ప్రారంభోత్సవం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ క్లాప్‌ కొట్టారు, సినిమా యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఓ యూనిక్‌ సబ్జెక్ట్‌ని డైరెక్టర్‌ అభినయకృష్ణ సిద్ధం చేశారని, అన్నివర్గాలకూ నచ్చే థ్రిల్లర్‌ అవుతుందని, ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామని నిర్మాతలు పేర్కొన్నారు. ఆనంద్‌, శరణ్య ప్రదీప్‌, వైష్ణవ్‌, ధనరాజ్‌, రాఘవ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి కెమెరా: రమేష్‌ కుశేందర్‌రెడ్డి, సంగీతం: గ్యాని.

editor

Related Articles