‘బింబిసార 2’కు దర్శకుని మార్చిన కళ్యాణరామ్

‘బింబిసార 2’కు దర్శకుని మార్చిన కళ్యాణరామ్

క‌ళ్యాణ్‌రామ్ హీరోగా న‌టించిన బింబిసారా సినిమా ఎంత పెద్ద సూప‌ర్ హిట్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. సోషియో ఫాంటసీ డ్రామాగా వ‌చ్చిన ఈ సినిమా మంచి క‌లెక్ష‌న్లు సాధించ‌డంతో పాటు కళ్యాణ్ రామ్ కెరీర్‌లో టాప్ టెన్‌లో ఒక‌టిగా నిలిచింది. ఈ సినిమాకు వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వం వహించాడు. ఈ సినిమా అనంత‌రం దీనికి సీక్వెల్‌ను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే ఆ ప్రాజెక్ట్‌ను వ‌శిష్ట కాకుండా కొత్త ద‌ర్శ‌కుడు అనీల్ పదురీ తెర‌కెక్కిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ నుండి తాను త‌ప్పుకోవ‌డానికి గ‌ల కారణాన్ని వెల్ల‌డించాడు ద‌ర్శ‌కుడు వ‌శిష్ట‌. ఆయ‌న మాట్లాడుతూ.. ‘బింబిసార 2’ కి అనీల్ పదురీ మంచి క‌థ రాశాడు. దీంతో నేను ఈ ప్రాజెక్ట్ చేస్తే సెట్ అవ్వ‌దు అనిపించింది. అందుకే ఈ ప్రాజెక్ట్‌ను అనీల్ తెర‌కెక్కిస్తున్నాడు. అనీల్ నా కంటే బెట‌ర్‌గా తీస్తాడనే న‌మ్మ‌కం ఉంది కాబ‌ట్టే నాతో పాటు క‌ళ్యాణ్ రామ్ అత‌డే బెట‌ర్ అని ఫిక్స్ అయ్యాం. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీద‌కి వెళ్ల‌నున్న‌ట్లు తెలిపాడు.

editor

Related Articles