‘కె-ర్యాంప్‌’ అక్టోబర్‌ 18న రిలీజ్..

‘కె-ర్యాంప్‌’ అక్టోబర్‌ 18న రిలీజ్..

‘క’ సినిమాతో  హిట్‌ అందుకున్న హీరో కిరణ్‌ అబ్బవరం తాజా సినిమా ‘కె-ర్యాంప్‌’. యుక్తి తరేజా హీరోయిన్. జైన్స్‌ నాని దర్శకుడు. రాజేష్‌ దండా, శివ బొమ్మకు నిర్మాతలు. అక్టోబర్‌ 18న దీపావళి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమా నుండి ‘ఓనమ్‌’ లిరికల్‌ సాంగ్‌ని శనివారం మేకర్స్‌ విడుదల చేశారు. ‘ఇన్‌స్టా ఆపేశానే.. ట్విట్టర్‌ మానేశానే.. నీకే ట్యాగ్‌ అయ్యానే మలయాళీ పిల్లా..’ అంటూ సాగే ఈ పాటను సురేంద్రకృష్ణ రాయగా, చేతన్‌ భరద్వాజ్‌ స్వరపరచి సాహితీ చాగంటితో కలిసి ఆలపించారు. మాస్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా మంచి బీట్‌తో ఈ పాట రూపొందించామని, కేరళ ఓనమ్‌ పండుగ సందడంతా ఈ పాటలో కనిపిస్తుందని, కిరణ్‌ అబ్బవరం, యుక్తి తరేజా మాస్‌ స్టెప్పులు ఈ పాటకు స్పెషల్‌ ఎట్రాక్షన్‌ కానున్నాయని మేకర్స్‌ తెలిపారు. నరేష్‌, సాయికుమార్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి కెమెరా: సతీష్‌ రెడ్డి మాసం.

editor

Related Articles