దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌కు టాలీవుడ్ నుండి మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మలయాళ హీరో మోహన్‌లాల్‌ను కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపిక చేయడం పట్ల చిత్రపరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ప్రథమంగా మెగాస్టార్ చిరంజీవి మోహన్‌లాల్‌ను సోషల్ మీడియా ద్వారా అభినందించారు. ‘డియర్ లాలెట్టన్. ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించినందుకు హృదయపూర్వక అభినందనలు. మీ అద్భుతమైన ప్రయాణం, ఐకానిక్ పెర్ఫార్మెన్స్, భారతీయ సినిమాను సుసంపన్నం చేశాయి. నిజంగా ఇది మీ ప్రతిభకు తగిన గుర్తింపు’ అని చిరంజీవి పేర్కొన్నారు.
ఆపై జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) సైతం స్పందిస్తూ.. లెజెండరీ నటుడు మోహన్‌లాల్‌కి ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించిన సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.