బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్ తన తల్లి, దివంగత నటి శ్రీదేవి మృతిని గుర్తు చేసుకుంటూ చేసిన భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేసింది. ఒక ఇంటర్వ్యూలో జాన్వీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా ఆమె తన కుటుంబం ఎదుర్కొన్న బాధలు, అవమానాలను ఇంటర్వ్యూలో వివరించారు. ‘ఒకానొక సమయంలో మా కుటుంబసభ్యులను అనుమానంగా చూసేవారు. కొందరు మా మీద బురద జల్లాలని ప్రయత్నించారు. ఎవరూ సానుభూతి కూడా చూపలేదు’ అని ఆవేదన వ్యక్తం చేసింది. శ్రీదేవి 2018లో దుబాయిలో చనిపోయిన విషయం తెలిసిందే. అదే సమయంలో జాన్వీ తన తొలి సినిమా ‘ధడక్’కి సిద్ధమవుతోంది. తల్లి మరణవార్త ఇంకా తానూ మానసికంగా ఇబ్బంది ఎదుర్కొంటున్న సమయంలో సినిమా ప్రమోషన్స్, మీడియా ఈవెంట్లకు హాజరుకావాల్సి రావడం తనపై తీవ్రమైన ఒత్తిడిని తెచ్చిందని జాన్వీ ఆవేదన వ్యక్తం చేసింది. అమ్మ మరణం నాకు వ్యక్తిగతంగా ఎంతటి కోపం, బాధ కలిగించిందో.. కొంతమందికి అది ఒక గాలి వార్తలా అనిపించి, మా కుటుంబాన్ని పట్టించుకోవడం కూడా మానేశారు.

- September 3, 2025
0
40
Less than a minute
You can share this post!
editor