ఫ్యాషన్‌ ఈవెంట్‌లో మెరిసిన జాన్వీ కపూర్‌..

ఫ్యాషన్‌ ఈవెంట్‌లో మెరిసిన జాన్వీ కపూర్‌..

బాలీవుడ్‌ యంగ్ బ్యూటీ, హీరోయిన్, అలనాటి అందాల తార శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్‌  ఓ ఫ్యాషన్‌ ఈవెంట్‌లో తళుక్కున మెరిశారు. న్యూఢిల్లీలోని తాజ్‌ ప్యాలెస్‌లో జరుగుతున్న హ్యుందాయ్‌ ఇండియా కౌచర్‌ వీక్‌ 2025 (ICW 2025)లో సందడి చేశారు. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ జయంతి రెడ్డి రూపొందించిన పింక్‌ కలర్‌ లెహంగాలో ర్యాంప్‌పై  నడుస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను జాన్వీ ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.

editor

Related Articles