Movie Muzz

జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ (జె.ఎస్‌.కె)

జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ (జె.ఎస్‌.కె)

మలయాళ హీరో సురేష్‌గోపి, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌ ముఖ్య పాత్రల్లో రూపొందిన సినిమా ‘జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ’ (జె.ఎస్‌.కె). యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి ప్రవీణ్‌ నారాయణన్‌ డైరెక్షన్. జె.ఫణీంద్రకుమార్‌ నిర్మాత. ఉత్కంఠకు గురిచేసే కోర్ట్‌ డ్రామాగా ఈ సినిమా రూపొందిందని, జానకి అనే స్త్రీ తనకు జరిగిన అన్యాయాన్ని కోర్టు ద్వారా ఎలా ఎదుర్కొన్నది అనేదే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తమని, కేసు వాదించే లాయర్‌గా సురేష్‌గోపీ నటించారని, ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేస్తామని మేకర్స్‌ తెలిపారు. బైజు సందోష్‌, మాధవ్‌ సురేష్‌గోపి, దివ్య పిళ్లయి, అస్కర్‌ అలీ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: రెనదివ్‌, సంగీతం: గిరీష్‌ నారాయణన్‌.

administrator

Related Articles