గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా ‘అఖండ 2: తాండవం’. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్స్, ఫస్ట్ సింగిల్ తాండవం అద్భుతమైన రెస్పాన్స్‌తో భారీ అంచనాలు సృష్టించాయి. ఈ మూవీ డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో మేకర్స్ మరో సాంగ్‌ను రిలీజ్ చేశారు. అఖండ- 2 నుంచి సెకండ్ సింగిల్‌గా ‘జాజికాయ’ అంటూ సాగే పవర్‌ఫుల్ మాస్ డ్యాన్స్ నెంబర్ రిలీజ్ అయింది. ఈ పాటను ప్రముఖ లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ అత్యద్భుతమైన క్యాచీ లిరిక్స్‌తో రాయగా..స్టార్ సింగర్స్ శ్రేయాఘోషల్, బ్రిజేష్ శాండిల్యా ఎంతో ఎనర్జిటిక్‌గా పాడారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ థియేటర్స్ దద్దరిల్లేలా పాటని కంపోజ్ చేశారు.
- November 19, 2025
0
11
Less than a minute
You can share this post!
editor

