జగపతిబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నిర్మాత దిల్‌రాజు. తన నిర్మాణంలో వచ్చిన ఆకాశమంత సినిమాకు అసలు డబ్బులు తీసుకోకుండా నటించినట్లు తెలిపాడు. ప్రకాశ్‌రాజ్, త్రిష ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా ఆకాశమంత. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్ రాజు నిర్మించగా.. రాధ మోహన్ దర్శకత్వం చేశారు. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా 2008లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్‌రాజు ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేశారు. ఆకాశమంత సినిమాలో ఒక పాత్ర ఉంది చేస్తారా అని జగపతిబాబును సంప్రదించాం.. పాత్ర నచ్చడంతో సినిమాకి ఓకే చెప్పాడు. అనంతరం రెమ్యూనరేషన్ టాపిక్ వస్తే.. ఫ్రీగా చేస్తాను అన్నాడు. దీంతో మేం అందరం షాక్ అయ్యాం. అయితే జగపతిబాబు మాట్లాడుతూ.. నాకు వేతనం వద్దు దిల్‌రాజు.. మంచి చిత్రంలో యాక్ట్ చేస్తున్నా అది చాలు నా కెరియర్‌కు అన్నాడు. దీంతో నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి అంటూ దిల్‌రాజు చెప్పుకొచ్చారు.

- November 2, 2024
0
25
Less than a minute
Tags:
You can share this post!
administrator