తమిళనాడులో కనీసం 5 షోలు అయినా ‘క’ సినిమా వేయండి.. కిరణ్ అబ్బవరం రిక్వెస్ట్.. నాకు అనేక ఫోన్లు వస్తున్నాయి, ప్లీజ్ మా రిక్వెస్ట్‌ను అంగీకరించండి. వాళ్ళు పట్టించుకోరు అంటూ SKN సంచలన రిప్లై ఇచ్చారు.. తమిళ్ సినిమాలకు ఇంత సపోర్ట్ చేస్తున్నా, వాళ్ళ హీరోలను మనం సొంత హీరోలుగా భావిస్తున్నా తమిళ్ వాళ్ళు మాత్రం తెలుగు సినిమాలను, హీరోలని ఎంకరేజ్ చేయరు. కిరణ్ అబ్బవరం దీపావళికి ‘క’ సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టాడు. రెండు రోజుల్లోనే ఆల్మోస్ట్ 13 కోట్ల గ్రాస్ వసూలు చేసి కెరీర్ హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టాడు. దీపావళికి ఎక్కువ సినిమాలు రిలీజ్ కావడంతో తెలుగులో మొదట తక్కువ స్క్రీన్స్ ఇచ్చినా ఇప్పుడు హిట్ అవ్వడంతో మళ్ళీ స్క్రీన్స్ పెంచుతున్నారు ‘క’ సినిమాకు. అయితే తమిళ్, మలయాళంలో మాత్రం వాళ్ళ సినిమాలు ఉన్నాయని వచ్చే వారం రిలీజ్ చేస్తామన్నారు. ‘క’ కు థియేటర్ల కొరత ఏర్పడింది. ఇతర రాష్ట్రాలలో అసలు థియేటర్లే దొరకడం లేదు.

- November 2, 2024
0
29
Less than a minute
Tags:
You can share this post!
administrator