నిర్మాత, తెలంగాణ FDC చైర్మన్ దిల్ రాజు నివాసాలు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని తెలిసిందే. హైదరాబాద్‌లోని 8 చోట్ల ఏకకాలంలో 55 బృందాలు దాడులు చేపట్టాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తూనే ఉన్నారు. దిల్ రాజు భార్య తేజస్వినిని అధికారులు బ్యాంక్‌కు తీసుకెళ్లారు. తేజస్విని మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ ఉదయం నుండి ఐటీ సోదాలు జరుగుతున్నాయన్నారు. బ్యాంకు వివరాలు కావాలని అధికారులు అడిగారు. బ్యాంకు లాకర్స్ ఓపెన్ చేసి చూపించామని చెప్పారు. దిల్ రాజు నివాసాలతోపాటు ఆయన సోదరుడు శిరీష్, కుమార్తె హన్సితరెడ్డి ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
- January 21, 2025
0
155
Less than a minute
Tags:
You can share this post!
administrator


