గాయనిగా శ్రేయాఘోషల్ కెరీర్ నిజంగా ప్రత్యేకం. బాలీవుడ్ గాయనీమణులు లతా మంగేష్కర్, అనురాధా పోడ్వాల్, ఆశా భోంస్లే ఇతర భాషల్లో పాటలు పాడినా.. చాలా తక్కువగా మాత్రమే పాడేవారు. కానీ శ్రేయాఘోషల్ అలా కాదు. కెరీర్ మొదలుపెట్టిన నాటి నుండి దేశంలోని అన్ని భాషల్నీ చుట్టేస్తూ జాతీయ గాయనిగా హవా సాగిస్తున్నారు. ప్రస్తుతమైతే శ్రేయా ఘోషల్‌ని ఓ భాషకు కట్టిపడేయలేం. అన్ని భాషలూ ఆమెవే. రీసెంట్‌గా ‘తండేల్’లో ఆమె పాడిన ‘హైలెస్సో.. హైలస్సా..’ పాట తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతోంది. త్వరలో ఆమె తమిళనాడులోని చెన్నై, కోయంబత్తూర్‌లలో మ్యూజికల్ లైవ్ కాన్సర్ట్‌ను నిర్వహించనుంది. ఈ సందర్భంగా చెన్నైలో ఆమె విలేకరులతో ముచ్చటించింది. సంగీతమంటే తనకెంతో ఇష్టమని, భాషలకు అతీతమైన అభిమానం తన పాటలకు లభించడం అదృష్టంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా శ్రేయాఘోషల్ అన్నారు. మిగతా భాషలతో పోలిస్తే తమిళ, మలయాళ భాషల్లో పాటలు పాడటం కాస్త కష్టంగా ఉంటుందని, అందుకే ఆ భాషల్లో పాడటానికి కాస్త ఎక్కువ టైమ్ తీసుకుంటానని శ్రేయా తెలిపారు.

- February 21, 2025
0
17
Less than a minute
Tags:
You can share this post!
editor