పుష్ప 2 లో ఫహద్ ఫాజిల్ పాత్రని సుకుమార్ చాలా వెరైటీగా డిజైన్ చేశాడు. ‘పార్టీ లేదా పుష్పా?’ అంటూ తనదైన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. సెకండ్ పార్ట్‌లో ఆయన పాత్రను కాస్త డౌన్ చేశారనే టాక్ వచ్చినప్పటికీ, ‘పుష్ప 2’ సక్సెస్‌లో ఫహాద్ పాత్ర కూడా తప్పక ఉంటుంది. అయితే ఆయన ఆ పాత్ర కోసం నిజంగానే గుండు చేయించుకున్నాడని అందరు అనుకున్నారు. కాని అది రియల్ గుండు కాదని ఇన్ని రోజులకి తెలిసింది. యాక్టర్ బ్రహ్మాజీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేయగా, ఇది ‘పుష్ప 2’ సెట్స్‌లోని బీటీఎస్ వీడియో. ఇందులో ఫహద్ బోట్‌లో వెళ్తుండగా.. వెనుక నుండి బ్రహ్మాజీ దాన్ని తన మొబైల్ ఫోన్‌లో క్యాప్చర్ చేశాడు. ఇందులో మనం గమనిస్తే ఫహద్ నెత్తి మీద ముడుతలు చూడొచ్చు. అంటే ఫహద్ ఫాజిల్ తలను గుండు మాదిరిగా మేకప్ చేసి కవర్ చేశారనే విషయం ఈ వీడియో ద్వారా స్పష్టంగా అర్ధమవుతోంది. ఇక వీడియో చూసిన ప్రతి ఒక్కరు అమ్మ.. షెకావత్ భలే మోసం చేశావుగా, ఇన్నాళ్లు అందరూ నిజమైన గుండు అనుకున్నాము అని కామెంట్స్ చేస్తున్నారు.

- March 22, 2025
0
45
Less than a minute
Tags:
You can share this post!
editor