ఈ యంగ్ డైరెక్టర్‌తో మళ్ళీ జతకడుతున్న రామ్?

ఈ యంగ్ డైరెక్టర్‌తో మళ్ళీ జతకడుతున్న రామ్?

మన టాలీవుడ్ హీరోస్‌లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కూడా ఒకరు. మరి రామ్ హీరోగా ప్రస్తుతం దర్శకుడు మహేష్ బాబుతో ఓ క్లీన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ముందు వరకు అన్నీ మాస్ సినిమాలే తాను చేయగా ఇప్పుడు మళ్ళీ తనకి సూటయ్యే క్లాస్ ట్రాక్‌లోకి వచ్చాడు. ఇక దీనిపై కూడా మంచి బజ్ నెలకొనగా ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ బజ్ తన లైనప్‌పై వినిపిస్తోంది. ప్రస్తుతం రామ్ మరో దర్శకునికి ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. అది కూడా ఆ దర్శకుడు ఎవరో కాదు మన తెలుగులో “హిట్” సినిమా యూనివర్స్‌ని పరిచయం చేసిన దర్శకుడు శైలేష్ కొలనుతో అట. ప్రస్తుతం ఈ కాంబినేషన్‌లో ఓ మాస్ ప్రాజెక్ట్ చర్చల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ సినిమాని డైనమిక్ ప్రొడ్యూసర్ నాగవంశీ ట్రాక్‌లోకి తీసుకురానున్నట్టుగా టాక్. మరి ఈ సినిమాపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

editor

Related Articles