సైలెంట్‌గా షూటింగ్ జరుగుతున్న ‘కాంచన 4’?

సైలెంట్‌గా షూటింగ్ జరుగుతున్న ‘కాంచన 4’?

కామెడీ హర్రర్ బ్యాక్ డ్రాప్‌లో సెన్సేషనల్ హిట్ అయ్యిన సినిమాలు అలాగే ఫ్రాంచైజీలో కోలీవుడ్ సూపర్ హిట్ సిరీస్ ‘ముని’ టర్న్డ్ ‘కాంచన’ సిరీస్ అని చెప్పాలి. మరి మల్టీ టాలెంటెడ్ రాఘవ లారెన్స్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలు ఫైనల్‌గా నాలుగో సినిమా ఇప్పుడు అనౌన్స్ అయ్యిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పట్ల కూడా మంచి అంచనాలు నెలకొనగా, ఈ సినిమా పనులు శరవేగంగా కంప్లీట్ అవుతున్నాయట. మరి ఆల్‌రెడీ ఈ సినిమా మూడు షెడ్యూల్స్‌ని పూర్తి చేసేసుకున్నట్టు లేటెస్ట్ టాక్. దీంతో సైలెంట్ గానే సినిమా కంప్లీట్ చేసుకుంటోందని చెప్పాలి. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే నటిస్తుండగా అతి త్వరలోనే రిలీజ్ డేట్‌ని కూడా అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది.

editor

Related Articles