సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు గోప్యంగా ఉంటే మంచిది?

సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు గోప్యంగా ఉంటే మంచిది?

కళాకారులు తమ కళారూపాల ద్వారా మాత్రమే ప్రేక్షకులకు చేరువ కావాలి తప్ప.. వ్యక్తిగతంగా కాకూడదు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు ఎంత గోప్యంగా ఉంటే అంత మంచిది. అందుకే.. సోషల్‌ మీడియా అకౌంట్‌ ఉన్నా.. దాన్ని తక్కువగా వాడతాను.’ అంటోంది యామీ గౌతమ్‌. ఇంకా ఆమె చెబుతూ ‘ఈ మధ్య చాలామంది సెలబ్రిటీలు వారి జీవితాల్లో జరిగే ప్రతి విషయాన్నీ సోషల్‌ మీడియాతో పంచుకుంటున్నారు. మన జీవితంలో జరిగే ప్రతీది సమాజానికి అక్కర్లేదు. అసలు మన గురించి ప్రజలు ఎందుకు ఆలోచించాలి?. వాళ్లకు మన గురించి ఎంత తక్కువ తెలిస్తే.. మన పాత్రలు వాళ్లకు అంత ఎక్కువగా కనెక్ట్‌ అవుతాయ్‌. తెరపై కనిపించగానే మన వ్యక్తిగత జీవితం వాళ్లకు గుర్తుకు రాకూడదు.’ అని అభిప్రాయపడ్డారు యామీ గౌతమ్‌. తన కుమారుడి గురించి మాట్లాడుతూ ‘నా కొడుకుని కూడా మీడియాకు దూరంగా పెంచాలనుకుంటున్నా. వాడు సెలబ్రిటీ కొడుగ్గా కాకుండా సామాన్యుడిగా పెరగాలని ఆశిస్తున్నా’ అని తెలిపారు యామి గౌతమ్.

editor

Related Articles