ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ ‘ఓజి’ ఫస్ట్ సింగిల్‌పై ఇంట్రెస్టింగ్ బజ్!

ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ ‘ఓజి’ ఫస్ట్ సింగిల్‌పై ఇంట్రెస్టింగ్ బజ్!

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న అవైటెడ్ సినిమాల్లో దర్శకుడు సుజీత్‌తో చేస్తున్న భారీ సినిమా “ఓజి” కూడా ఒకటి. ఈ సినిమా అతి త్వరలోనే విడుదల కాబోతోంది. అయితే  విడుదలకి ముందు సినిమా పవర్‌ఫుల్ సాంగ్ ఫస్ట్ సింగిల్‌గా విడుదల కావాల్సి ఉంది. నిజానికి దీనిని మేకర్స్ ఎప్పుడో… విడుదల చేయాల్సింది కానీ పలు కారణాలు చేత చేయలేదు. ముఖ్యంగా దీనికి ముందు హరిహర వీరమల్లు విడుదల కావాల్సి ఉంది. దీనితో ఒక్కసారి వీరమల్లు విడుదల అయ్యాక ఓజి ర్యాంపేజ్ స్టార్ట్ అవుతుంది. ఇలా ఓజి ఫస్ట్ సింగిల్ ఆగస్ట్ మొదటి వారంలో విడుదల చేసే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆల్‌రెడీ శింబుతో థమన్ కంపోజ్ చేసిన ఈ పాటపై మంచి అంచనాలు ఉన్నాయి.

editor

Related Articles