బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ‘సితారే జమీన్ పర్’ సినిమా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. పాపులర్ స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్ అయిన యూట్యూబ్‌లో కేవలం రూ.100 లకే ఈ సినిమా ప్రస్తుతం పే-పర్-వ్యూ మోడల్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తాజాగా ఈ సినిమాపై మరో బంఫర్ ఆఫర్‌ని ప్రకటించింది చిత్రయూనిట్. ఇండిపెండెన్స్ డే కానుకగా.. ఈ సినిమాను కేవలం రూ.50 లకే అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ సినిమాను చూడాలనుకునేవారు యూట్యూబ్‌లో కేవలం రూ.50 చెల్లిస్తే సరిపోతుంది. ఈ ఆఫర్ ఆగస్ట్ 15 నుండి 17 వరకు ఉంటుందని తెలిపింది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ సినిమాను చూసేయండి.

- August 14, 2025
0
36
Less than a minute
Tags:
You can share this post!
editor