‘జూనియర్’ కోసం  పెంచిన రెమ్యూనరేషన్: శ్రీలీల..

‘జూనియర్’ కోసం  పెంచిన రెమ్యూనరేషన్: శ్రీలీల..

టాలీవుడ్‌లో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా ‘జూనియర్’ రిలీజ్‌కు రెడీ అయింది. కిరీటి హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయింది. దీనికి తోడు ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యేలా చేసింది. ఈ సినిమాలో నటించేందుకు శ్రీలీల భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘జూనియర్’ సినిమా కోసం ఆమె ఏకంగా రూ.2.5 కోట్ల మేర రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీలీలకు ఉన్న క్రేజ్, డిమాండ్ బట్టి  ఆమె ఇంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో జెనీలియా మరో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా సాయి కొర్రపాటి ప్రొడ్యూస్ చేశారు. జూలై 18న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్‌ చేయడానికి రెడీ అవుతోంది.

editor

Related Articles