యూనివర్సల్ స్టూడియో దగ్గర ఐకాన్ స్టార్ ఫ్యామిలీ..

యూనివర్సల్ స్టూడియో దగ్గర ఐకాన్ స్టార్ ఫ్యామిలీ..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత చేస్తున్న భారీ సినిమా గురించి అందరికీ తెలిసిందే. దర్శకుడు అట్లీ పాన్ వరల్డ్ లెవెల్లో ప్లాన్ చేస్తున్న ఈ సినిమా కోసం సిద్ధమయ్యాడు. ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టూడియోస్‌తో టీం వర్క్ చేస్తుండగా ఐకాన్ స్టార్‌పై కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. రీసెంట్‌గా బన్నీ యూఎస్ నాట్స్ తానా సభలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత తన కుటుంబంతో కలిసి యూఎస్‌లో కనిపించిన పిక్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. అల్లు స్నేహారెడ్డి, తమ పిల్లలు అల్లు అర్హ, అయాన్ లతో కలిసి బన్నీ కనిపించాడు. అలాగే అయాన్‌తో కలిసి హాలీవుడ్ యూనివర్సల్ స్టూడియో దగ్గర కూడా అల్లు అర్జున్ కనిపించిన పిక్ మరింత ఆసక్తిని రేకెత్తించింది.

editor

Related Articles