‘దబాంగ్’ సినిమాతో బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది సోనాక్షి సిన్హా. ఆ తర్వాత కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ అఖిరా, లుటేరా, ఫోర్స్ 2 లాంటి సినిమాల్లో పెర్ఫార్మెన్స్ రోల్స్‌తో అలరించింది. కానీ ఆ సినిమాలేవీ ఆమెకు కలిసి రాలేదు. దీంతో సోనాక్షి సిన్హా కెరీర్ కాస్త స్లో అయింది. ఈ లోపు సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్‌ను పెళ్లి చేసుకుంది. సోనాక్షి సిన్హా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్విమ్ సూట్ వేసుకోవడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ, సోనాక్షి సిన్హా ఏం మాట్లాడింది అంటే.. ‘ఇండియాలో నేను బికినీ వేసుకోను. దేశం బయటకు వెళ్ళినప్పుడు మాత్రం కచ్చితంగా బికినీ వేసుకుంటాను. ఎందుకంటే ఇండియాలో బికినీ వేసుకుంటే ఎవరు ఎక్కడి నుంచి ఫొటో తీస్తారో తెలియదు. అందుకే, ఇండియా వదిలి వేరే దేశానికి వెళ్ళినప్పుడు మాత్రమే బికినీ వేసుకుని స్విమ్మింగ్ చేస్తాను’ అని సోనాక్షి సిన్హా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

- March 3, 2025
0
18
Less than a minute
Tags:
You can share this post!
editor