అలాంటి వాళ్లతో నాకు జోడి కుదరదని అర్థమైంది..

అలాంటి వాళ్లతో నాకు జోడి కుదరదని అర్థమైంది..

ఇటీవల ఓ ప్రెస్‌మీట్‌లో పెళ్లి గురించి ఓ జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నకు వ్యంగ్యంగా  సమాధానమిచ్చిన నిత్యామీనన్‌.. రీసెంట్‌గా ఓ ఇంటర్యూలో తాను పెళ్లికి దూరంగా ఉండటానికి అసలైన కారణం ఏంటో తెలియజేసింది. ఆమె మాట్లాడుతూ ‘పెళ్లి చేసుకునేందుకు ఇప్పటికి నాలుగుసార్లు సిద్ధపడ్డా. జీవిత భాగస్వామి కావాల్సిన వ్యక్తి గురించి పూర్తిగా తెలీకుండా తాళి కట్టించుకోవడం నాకిష్టం ఉండదు. అందుకే.. పెళ్లికి సిద్ధపడ్డ నాలుగు పర్యాయాలూ, సదరు వ్యక్తి గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించా.

మాటల్ని బట్టి ఎదుటివారి గుణగుణాలను నేను అంచనా వేయగలను. ఆ విధంగా చూసిన నలుగురూ నాకు సెట్‌ కారని అర్థమైంది. దీనికి తోడు రెండుసార్లు ప్రేమలోనూ విఫలమయ్యా. విఫలమైన ప్రతిసారీ మళ్లీ ప్రేమను పొందాలనుకోవడం సబబు కాదు. అందుకే సింగిల్‌గా ఉండిపోయా. అయినా.. ఇది బావుందికదా..’ అంటూ అందంగా నవ్వేశారు నిత్యామీనన్‌. ఇప్పటికి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి 60 సినిమాలను పూర్తి చేసిన నిత్యా.. గత ఏడాది ‘తిరుచిత్రాంబళం’ సినిమాకు గాను ఉత్తమనటిగా జాతీయ అవార్డును అందుకున్నారు.

editor

Related Articles