బరువు బాధ్యతల మధ్య నలిగిపోతున్న అన్నయ్యగా కనిపిస్తా

బరువు బాధ్యతల మధ్య నలిగిపోతున్న అన్నయ్యగా కనిపిస్తా

సినిమా చూస్తున్నంతసేపూ ప్రేక్షకులకు తమ జీవితాల్లో జరిగిన పాత సంఘటనలు గుర్తొస్తాయి. జనరల్‌గా నా సినిమాల్లో ఉండే వినోదంతోపాటు భావోద్వేగాలు కూడా ఇందులో ఉంటాయని తెలిపారు హీరో సంపూర్ణేష్‌బాబు. ఆయన హీరోగా నటించిన సినిమా ‘సోదరా’. సంజోష్‌ ఇందులో మరో హీరో. మన్‌మోహన్‌ మేనంపల్లి దర్శకుడు. చంద్ర చగంలా నిర్మాత. ఈ నెల 25న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంపూర్ణేష్‌బాబు మాట్లాడారు. ‘అమాయకుడైన అన్న, అప్‌డేట్‌ అయిన తమ్ముడు మధ్య నడిచే కథ ఇది. ఈ తరహా కథ ఇప్పటివరకూ రాలేదు. అన్నదమ్ములు కలిసుండాలనేది ఈ కథలో నీతి.’ అని మరో హీరో సంజోష్‌ తెలిపారు. ‘అన్నదమ్ముల అనుబంధాన్ని తెరపై ఆవిష్కరించే సినిమా ‘సోదరా’. అన్నగా బరువుబాధ్యతలున్న పాత్రను ఇందులో పోషించా.

editor

Related Articles