‘ఈ సినిమా కోసం నేనిచ్చిన ట్యూన్‌కి కీరవాణి పాట రాశారు. తను రాసిన పాట పల్లవి విన్నప్పుడు.. తన మనసులో నాపై ఉన్న అభిమానాన్నీ, ఆత్మబంధాన్నీ క్రోడీకరించి రాశారనిపించింది. సంగీత దర్శకుడు కావడానికి ముందూ, అయిన తర్వాత కూడా నాపై ఆయనకున్న అభిమానం అలాగే ఉంది.’ అన్నారు సంగీత దర్శకుడు ఇళయరాజా. రూపేష్, ఆకాంక్షాసింగ్ జంటగా.. ‘లేడీస్ టైలర్’ ఫేం రాజేంద్రప్రసాద్, అర్చన మరో జంటగా రూపొందిన సినిమా ‘షష్టిపూర్తి’. పవన్‌ప్రభ దర్శకత్వంలో రూపేష్ చౌదరి నిర్మించిన ఈ సినిమాకి ఇళయరాజా సంగీతం అందించారు. త్వరలో సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన టీజర్ లాంచ్ కార్యక్రమంలో ఇళయరాజా మాట్లాడారు. ఇంకా చెబుతూ ‘ఈ సినిమాకు నేను చేసిన స్వరాలలో కొన్నింటిని మీరు విన్నారు. నేను చేసిన వేలాది పాటల్లో నాకు నచ్చినపాట ఏదని అడిగితే.. ఒకటా రెండా?! నాకు ఎంత సంగీతం తెలుసన్నది ఇక్కడ ముఖ్యం కాదు. సంగీతమే నా గురించి తెలుసుకుంది. నాలోంచి సంగీతం ఎలా వస్తుందో నాకే తెలీదు. ఎప్పటికీ తెలియకూడదని దేవుణ్ణి కోరుకుంటున్నా.
- April 21, 2025
0
65
Less than a minute
Tags:
You can share this post!
editor

