నా పిల్లలకై నేను పురిటినొప్పులు పడలేదు..

నా పిల్లలకై నేను పురిటినొప్పులు పడలేదు..

అందాల తార సన్నీ లియోన్  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు శృంగార తారగా ఒక ఊపు ఊపిన సన్నీ.. ఆ తరువాత ఆ వృత్తి నుండి బయటకు వచ్చి బాలీవుడ్‌లో నటిగా స్థిరపడింది. డేవిడ్ వెబర్‌ను పెళ్ళాడిన సన్నీ లియోన్ ముగ్గురు పిల్లలకు తల్లి అయ్యింది. అయితే వారిని  ఆమె కనలేదు. సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మనివ్వగా.. ఒక పాపను మాత్రం దత్తత తీసుకుంది. తాజాగా తన సరోగసీ ద్వారా ఎలా ప్రయాణం చేసిందో సన్నీ మొదటిసారి పెదవి విప్పింది. బాలీవుడ్ హీరోయిన్ సోహా అలీఖాన్ పాడ్ క్యాస్ట్‌కు హాజరైన సన్నీ.. తన బిడ్డల గురించి చెప్పుకొచ్చింది. తనకు బిడ్డలను తన కడుపులో మోయడం ఇష్టం లేకనే సరోగసీ ద్వారా పిల్లలకు జన్మనిచ్చినట్లు తెలిపింది. మొదటి నుండి నాకు ఒక బిడ్డను దత్తత తీసుకోవాలని ఉండేది. మొదటిసారి ఐవిఎఫ్ ఫెయిల్ అయ్యాకా.. బిడ్డ దత్తతకు మేము అప్లై చేశాం కూడా. అప్పుడే ఒక పాపను దత్తత తీసుకున్నాం. ఇక సరోగసీనే ఎందుకు ఎంచుకున్నాను అంటే.. నాకు నా కడుపులో బిడ్డను మోయడం ఇష్టం లేదు. అందుకే ఒక మహిళను ఎంచుకొని ఆమె కడుపులో మా బిడ్డను పెంచాం. దానికి కొంత రుసుము చెల్లించాం. మా బిడ్డల వలన ఆమె ఒక ఇల్లు కూడా కట్టుకుంది. మొదటి భర్తకు విడాకులిచ్చి రెండోపెళ్లి కూడా చేసుకుంది   అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సన్నీ వ్యాఖ్యలు సోషల్ మీడియాను కొంత కుదిపేస్తున్నాయి.

editor

Related Articles