హాలీవుడ్ పాప్ స్టార్ ఎన్రిక్ ఇగ్లేసియాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఈ స్టార్ సింగర్ 13 ఏండ్ల తర్వాత ఇండియాకి రాబోతున్నాడు. ఈ ఏడాది అక్టోబర్ 30న ముంబైలోని MMRDA గ్రౌండ్స్, బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC) లో తన మ్యూజికల్ కన్సర్ట్‌ని నిర్వహించనున్నట్లు ఎన్రిక్ తాజాగా ప్రకటించారు. చివరిగా 2012లో తన కన్సర్ట్‌ని ఇండియాలో నిర్వహించిన ఎన్రిక్, ఇప్పుడు 13 ఏళ్ల తర్వాత రాబోతుండటంతో అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ వేడుకకు 30,000 మందికి పైగా అభిమానులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ కచేరీని EVA Live, BEW Live సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. “బైలాండో”, “హీరో”, “బైలామోస్”, “సుబేమే లా రేడియో”, “ఎస్కేప్” వంటి తన సూపర్ హిట్ పాటలతో ఎన్రిక్ ఇగ్లేసియాస్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరించారు. ఈ ముంబై కచేరీ కూడా సంగీత ప్రియులకు ఒక అద్భుతమైన అనుభూతిని అందిస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు.
- June 11, 2025
0
44
Less than a minute
Tags:
You can share this post!
editor

