పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్‌గా దర్శకులు క్రిష్, జ్యోతికృష్ణలు తెరకెక్కించిన సినిమా “హరిహర వీరమల్లు” గురించి అందరికీ తెలిసిందే. అయితే ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా దీనికి పార్ట్ 2 కూడా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. పార్ట్ 1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్‌గా వస్తుండగా పార్ట్ 2 ని మరో టైటిల్‌తో ప్లాన్ చేస్తున్నారు. నిధి అగర్వాల్ లేటెస్ట్‌గా పార్ట్ 2 పై ఇచ్చిన లీక్స్ వైరల్‌గా మారాయి. పార్ట్ 1 ఆల్‌రెడీ కంప్లీట్ అయ్యి రిలీజ్‌కి దగ్గర పడుతోంది కానీ, పార్ట్ 2 కి సంబంధించి తాము ఆల్‌రెడీ 20 శాతం షూటింగ్‌ని కంప్లీట్ చేసినట్టుగా ఆమె చెప్పుకొచ్చింది. అలాగే పార్ట్ 2 మిగతా షూటింగ్ కూడా త్వరలోనే మొదలవుతుంది అని కూడా తెలిపింది. దీంతో ఈ బ్యూటీ కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఇక ఈ అవైటెడ్ సినిమా రానున్న జులై 24న పాన్ ఇండియా లెవెల్లో థియేటర్లలో సందడి చేయబోతోంది.

- July 15, 2025
0
144
Less than a minute
Tags:
You can share this post!
editor