తమిళ హీరో కార్తి, జయం రవి శబరిమలలో కొలువైన అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. అయ్యప్ప మాల వేసుకున్న కార్తి, జయం రవిలు గురువారం రాత్రి ఇరుముడితో శబరిమలకి వెళ్లి మణికంఠుడిని దర్శించుకున్నారు. దర్శనానంతరం కార్తి మాట్లాడుతూ.. తాను తొలిసారి స్వామి మాల వేసుకుని శబరిమలకి వచ్చానని.. ఈ అనుభవం తనకు మానసిక శాంతిని, బలాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. కన్నె స్వామి(అయ్యప్ప మాల మొదటిసారి వేసుకున్నవారు)గా ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. పవళింపు సేవలో స్వామి వారిని దర్శించుకోవడం ఒక ప్రత్యేకమైన అనుభూతినిచ్చింది. భవిష్యత్తులో కూడా స్వామి వారి దర్శనానికి రావాలని కోరుకుంటున్నాను అని కార్తి మీడియాతో అన్నారు. జయం రవి మాట్లాడుతూ.. తాను ఇదివరకే చాలాసార్లు శబరిమల ఆలయాన్ని సందర్శించానని తెలిపారు. “నేను 2015 నుండి ఇక్కడికి వస్తున్నాను. ఇప్పటివరకు దాదాపు తొమ్మిదిసార్లు శబరిమలను దర్శించుకున్నాను.

- April 18, 2025
0
40
Less than a minute
Tags:
You can share this post!
editor