బాహుబలి సినిమాలో భళ్లాల దేవుడిగా నటించి దేశ వ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్న రానా దగ్గుబాటి. ఈ మధ్య మనోడి కెరీర్ కాస్త గాడి తప్పింది. దీంతో సైలెంట్ అయ్యాడు. ఇప్పుడు నిర్మాతగా వైవిధ్యమైన సినిమాలతో అలరిస్తున్నాడు. అయితే రానా తండ్రి కాబోతున్నాడంటూ కొన్నాళ్లుగా నెట్టింట అనేక వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. కొన్ని నెలల క్రితం రానాకి తండ్రి ప్రమోషన్ దక్కనుంది అంటూ ఆ వార్తని కొందరు వైరల్ చేస్తుండగా, తాజాగా మిహికా బజాజ్ ఫొటోని హైలైట్ చేస్తూ రానా త్వరలో తండ్రి కాబోతున్నట్టు ప్రచారాలు చేస్తున్నారు. మిహికా తన సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్‌లో తన పొట్టపై చేయి పెట్టుకుని జస్ట్ ఫెల్ట్ లైక్ ఇట్ అనే క్యాప్షన్ జోడించింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్.. మిహికా ప్రెగ్నెంట్ అని త్వరలోనే రానా తండ్రి కాబోతున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు అయితే కంగ్రాట్స్ అంటూ తమ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. ఇక మిహికా బజాజ్ విషయానికి వస్తే ఆమె హైదరాబాద్‌కు చెందిన ఎంటర్‌ప్రెన్యూర్. ‘డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో’ అనే ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ స్థాపకురాలిగా, ముంబై – హైదరాబాదుల్లో ప్రముఖ వెడ్డింగ్ ప్లానర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్ ప్రముఖులతోనూ మిహికాకు మంచి సంబంధాలు ఉన్నాయి.

- July 31, 2025
0
37
Less than a minute
Tags:
You can share this post!
editor