హీరో అజిత్‌కి తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం

హీరో అజిత్‌కి తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం

తమిళ హీరో,  ప్రముఖ రేసర్ అజిత్ కుమార్‌కు మరోసారి కారు రేసింగ్‌లో పెను ప్రమాదం తప్పింది. ఇటలీలోని మిసానోలో జరుగుతున్న GT4 యూరోపియన్ సిరీస్‌లో పాల్గొంటున్న సమయంలో, రేస్ 2లో ఆయన కారు ప్రమాదానికి గురైంది. అజిత్ డ్రైవ్ చేస్తున్న కారు, రేసింగ్ ట్రాక్ మధ్యలో ఆగి ఉన్న మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అజిత్ కారు ముందు భాగం పచ్చడైపోయింది, అదృష్టవశాత్తు ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రాణాపాయం నుండి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కార్ రేసింగ్‌లో అజిత్‌కు ప్రమాదం జరగడం ఇది మూడోసారి. గతంలో కూడా రెండుసార్లు ఆయన కార్ రేసింగ్‌లో పాల్గొన్నప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగాయి.

editor

Related Articles