డైవొర్స్ వేళ హ‌న్సిక ఎమోష‌న‌ల్ పోస్ట్..

డైవొర్స్ వేళ హ‌న్సిక ఎమోష‌న‌ల్ పోస్ట్..

దేశ ముదురు సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ హ‌న్సిక‌. ఈ హీరోయిన్  తెలుగులో పలువురు స్టార్ హీరోల‌తో క‌లిసి న‌టించింది. హిందీతో పాటు ఇత‌ర భాష‌ల‌లోను ప‌లు సినిమాలు చేసింది. మంచి టాలెంట్ ఉన్న హన్సిక‌కి ఇటీవ‌ల సినిమా అవ‌కాశాలు త‌గ్గాయి. అయితే 2022 డిసెంబర్‌లో హన్సిక తన బాయ్ ఫ్రెండ్ సోహైల్‌ని వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. హన్సిక స్నేహితురాలితో సొహైల్‌కు గ‌తంలో పెళ్లి అయినా, ఆమెకి విడాకులు ఇచ్చి హ‌న్సిక‌ని పెళ్లి చేసుకున్నాడు.

కొద్ది రోజులుగా హన్సిక, సొహైల్ కూడా విడిపోతున్నారని ప్రచారం జరుగుతోంది. కొన్నాళ్లుగా వీరు విడివిడిగా ఉంటున్నారని నెట్టింట వార్తలు వస్తున్నాయి. సోహైల్‌ది పెద్ద కుటుంబం కాగా, వారితో హన్సిక కలవలేకపోవడం వల్లే మనస్పర్థలు వచ్చాయని, అందుకే నటి ప్రస్తుతం తల్లి దగ్గరే ఉంటోందని టాక్ న‌డుస్తోంది. మ‌రోవైపు హ‌న్సిక త‌న సోష‌ల్ మీడియాలో పెళ్లి ఫొటోలు అన్ని డిలీట్ చేయ‌డంతో ఈ ప్రచారం నిజ‌మేన‌ని కొంద‌రు భావిస్తున్నారు. ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే హన్సిక లేదా సొహైల్ లేకుంటే వారి కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు స్పందిస్తే కాని క్లారిటీ రాదు.

editor

Related Articles