హన్సిక మోత్వానీ ప్రస్తుతం కుటుంబ వివాదంతో వార్తల్లో నిలిచింది. గత కొంతకాలంగా తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. హన్సిక వదిన నాన్సీ జేమ్స్ సోషల్ మీడియాలో చేసిన ఆరోపణలు వైరల్ అయ్యాయి. కుటుంబ సభ్యులు తనపై శారీరక, మానసిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె పేర్కొన్నారు.
ఈ ఆరోపణలు తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని హన్సిక వాదిస్తూ, ముంబై సెషన్స్ కోర్టులో రూ.2 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేసింది. అసత్య ఆరోపణలతో తమ గౌరవానికి భంగం కలిగించారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ అనంతరం కోర్టు ముస్కాన్‌పై తాత్కాలిక స్టే విధిస్తూ, పబ్లిక్ స్టేట్‌మెంట్లు ఇవ్వొద్దని ఆదేశించింది.
ఇప్పటికే వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న హన్సికకు ఈ వివాదం మరింత చర్చనీయాంశమైంది.

