నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న కామెడీ సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’. మురళీ మనోహర్ దర్శకుడు. జయకాంత్ (బాబీ) నిర్మాత. తమిళ నటుడు కమెడియన్ యోగిబాబు ఇందులో ఉడ్రాజుగా కీ రోల్ పోషిస్తున్నారు. యోగిబాబు పుట్టినరోజును పురస్కరించుకొని మంగళవారం ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ స్పెషల్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. పెర్‌ఫెక్ట్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలోని పాత్రల్నీ డిఫరెంట్‌గా డిజైన్ చేయడం జరిగిందని, హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా సాగుతుందని మేకర్స్ తెలిపారు. బ్రహ్మానందం, రాజ్‌కుమార్ కాసిరెడ్డి, జీవన్‌కుమార్, జాన్ విజయ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని డా.సంధ్య గోలీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

- July 23, 2025
0
65
Less than a minute
Tags:
You can share this post!
editor