‘ఘాజీ’ దర్శకునితో గోపీచంద్ హిస్టారికల్ సినిమా గ్లింప్స్!

‘ఘాజీ’ దర్శకునితో గోపీచంద్ హిస్టారికల్ సినిమా గ్లింప్స్!

మన టాలీవుడ్ హీరో గోపీచంద్ గత ఏడాది విశ్వం సినిమాతో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. మరి ఆ సినిమా తర్వాత ఘాజీ, అంతరిక్షం లాంటి వినూత్న సినిమాలు తెరకెక్కించి మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి కాంబినేషన్‌లో ఓ భారీ హిస్టారికల్ డ్రామాను తాను చేస్తున్నారు. మరి ఈ సినిమా నుండి మేకర్స్ లేటెస్ట్‌గా గోపీచంద్ పుట్టినరోజు కానుకగా ఫస్ట్ లుక్ ఇంకా గ్లింప్స్‌ని రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్‌లో గోపీచంద్ డైనమిక్‌గా వారియర్ లుక్‌లో కనిపిస్తుండగా గ్లింప్స్ కూడా చాలా బాగా వచ్చాయి. సింపుల్ విజువల్స్‌తోనే మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో వచ్చిన ఈ గ్లింప్స్ ఆసక్తిని రేకెత్తించింది. ఇక ఈ భారీ సినిమాని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు భారతదేశ చరిత్రలో మర్చిపోయిన అధ్యాయాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాపై మరిన్ని డిటెయిల్స్ ముందు రానున్నాయి.

editor

Related Articles