వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి. అనుదీప్ కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘ఫంకీ’. ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఒకరోజు ముందుగా థియేటర్లలో ‘ఫంకీ’ చిత్రం సందడి మొదలు కానుంది. అపరిమితమైన వినోదాన్ని అందించనున్న ఈ సినిమాను 2026 ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. తొలుత ‘ఫంకీ’ చిత్రాన్ని 2026 ఏప్రిల్ లో విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. ఇప్పుడు విడుదల తేదీ ముందుకు జరగడంతో.. కాస్త ముందుగానే ప్రేక్షకులు ఈ వినోదాల విందుని ఆస్వాదించనున్నారు. నవ్వులు, గందరగోళం, స్వచ్ఛమైన వినోదానికి పేరుగాంచిన అద్భుతమైన కలయికలో ఫంకీ రూపొందుతోంది. దర్శకుడు కె.వి. అనుదీప్ తన శైలి కామెడీ విందుతో తిరిగి వచ్చారు. ఈసారి రెట్టింపు నవ్వులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి సిద్ధమవుతున్నారు. అనుదీప్ దర్శకత్వం అంటే వినోదం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ‘జాతిరత్నాలు’ సినిమాతో సంచలనాలు సృష్టించిన ఆయన.. మరోసారి విభిన్నమైన కథాంశం, క
- December 15, 2025
0
4
Less than a minute
You can share this post!
editor


