ప్రముఖ నటి రాధికా శరత్‌కుమార్ డెంగ్యూ జ్వరంతో ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన రాధికను కుటుంబసభ్యులు ఈ నెల 28న తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు డెంగ్యూ సోకినట్లు నిర్ధారించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం రాధికకు చికిత్స అందిస్తున్నామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పేర్కొన్నాయి. ఈ నెల 5 వరకు ఆమెకు చికిత్స కొనసాగించాల్సిన అవసరం ఉందని, ఆ తర్వాత ఆమెను డిశ్చార్జి చేస్తామని డాక్టర్లు తెలిపారు. కాగా ఫ్యాన్స్, సన్నిహితులు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

- August 1, 2025
0
93
Less than a minute
Tags:
You can share this post!
editor