జాట్ సినిమా వివాదంలో స‌న్నీడియోల్‌, ర‌ణ్‌దీప్ హూడాపై ఎఫ్ఐఆర్‌

జాట్ సినిమా వివాదంలో స‌న్నీడియోల్‌, ర‌ణ్‌దీప్ హూడాపై ఎఫ్ఐఆర్‌

జాట్ సినిమాలో హీరో స‌న్నీ డియోల్‌తో పాటు ర‌ణ్‌దీప్ హూడా, వినీత్ కుమార్ సింగ్‌పై కేసు రిజిస్ట‌ర్ చేశారు. ఆ సినిమాలోని ఓ సీన్‌లో మ‌త‌ప‌ర‌మైన మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. జ‌లంధ‌ర్ పోలీసులు ఆ కేసు ఫైల్ చేశారు. స‌న్నీడియోల్ న‌టించిన బాలీవుడ్ సినిమా జాట్ వివాదంలో ఇరుక్కుంది. ఆ ఫిల్మ్‌లో న‌టించిన స‌న్నీ డియోల్‌తో పాటు ర‌ణ్‌దీప్ హూడా, వినీత్ కుమార్ సింగ్‌పై కేసు నమోదు చేశారు. జాట్ డైరెక్ట‌ర్ గోపిచంద్ మ‌లినేనితో పాటు నిర్మాత‌ల‌పైన కూడా కేసు పెట్టారు. భార‌తీయ న్యాయ సంహిత‌లోని సెక్ష‌న్ 299 ప్ర‌కారం కేసు పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 10వ తేదీన జాట్ సినిమా రిలీజైంది. ఆ ఫిల్మ్‌లో క్రైస్త‌వుల మ‌నోభావాలు దెబ్బ‌తీసే రీతిలో ఓ సీన్ ఉన్న‌ట్లు ఫిర్యాదు న‌మోదు అయ్యింది. యేసు క్రీస్తును అగౌర‌వ‌ప‌రుస్తున్న రీతిలో సీన్ ఉన్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. గుడ్ ఫ్రైడే, ఈస్ట‌ర్ ప‌ర్వ‌దినాలు ఉన్న ఈ ప‌విత్ర మాసంలో కావాల‌నే ఆ సినిమాను రిలీజ్ చేశార‌ని, క్రైస్త‌వుల్లో ఆగ్ర‌హాన్ని తెప్పించి, దేశంలో అల్ల‌ర్లు సృష్టించే ప్ర‌య‌త్నం చేశార‌ని, అందుకే డైరెక్ట‌ర్‌, నిర్మాత‌, ర‌చ‌యిత‌పై కేసు పెట్టిన‌ట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

editor

Related Articles