సినీ కార్మికులు తాత్కాలికంగా పనిచేస్తున్నారు.. ఇంకా కొలిక్కిరాని  సమ్మె..

సినీ కార్మికులు తాత్కాలికంగా పనిచేస్తున్నారు.. ఇంకా కొలిక్కిరాని  సమ్మె..

వేతనాలను పెంచాలని డిమాండ్‌ చేస్తున్న తెలుగు ఫిలిం ఫెడరేషన్‌కు చెందిన 24 క్రాఫ్ట్స్‌ కార్మికులను పక్కన పెట్టి ఇతర రాష్ర్టాల నుండి తీసుకువచ్చిన కార్మికులతో షూటింగ్‌లు చేయిస్తున్న వ్యవహారంతో జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోవద్ద సోమవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తున్న పవన్‌ కళ్యాణ్‌ నటించిన ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ షూటింగ్‌ను ముంబై, చెన్నైకి చెందిన కార్మికులతో చేయిస్తున్నారంటూ పెద్ద ఎత్తున కార్మికులు అన్నపూర్ణ స్టూడియోలోకి చొచ్చుకుపోయేందుకు యత్నించారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకోవడంతో వారంతా స్టూడియో గేటు ముందు బైఠాయించారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. 30 శాతం వేతనాలను పెంచాలంటూ గత నాలుగు నెలలుగా ఫిల్మ్‌ ఫెడరేషన్‌ డిమాండ్‌ చేస్తుంటే సమయం ఇవ్వాలంటూ కాలయాపన చేశారని కార్మికులు ఆరోపించారు. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న 12 సినిమాలకు సంబంధించిన నిర్మాతలు వేతన పెంపుకు అంగీకరించగా, మైత్రీ మూవీస్‌ సంస్థ మాత్రం ససేమిరా అంటూ మొండికేసిందనీ, పైగా ఫెడరేషన్‌కు చెందిన కార్మికులను కాకుండా బయటి ప్రాంతాల నుండి కార్మికులను తెచ్చి షూటింగ్‌లో పెట్టుకొని వారిచేత పని చేయించుకోవడం  దారుణమని ఆరోపించారు. మైత్రీ మూవీస్‌కు చెందిన 6 సినిమాల కోసం పనిచేసిన ఫెడరేషన్‌ కార్మికులకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సుమారు 2 గంటలపాటు ఆందోళన అనంతరం ఫెడరేషన్‌ ప్రతినిధులు చర్చలకు పిలవడంతో ఆందోళనను తాత్కాలికంగా విరమించారు. ఒక కాంప్రమైజ్ డెసిషన్‌కు వచ్చారో లేదో ఏమీ తెలియడం లేదు. ప్రస్తుతం కార్మికులు పని చేస్తున్నారు.

editor

Related Articles