సినీ దర్శకురాలు అపర్ణ మల్లాది (54) శుక్రవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె క్యాన్సర్‌తో బాధపడుతోంది. అమెరికాలో చికిత్స పొందుతూ అక్కడే మృతి చెందారు. ‘ది అనుశ్రీ ఎక్స్‌పెరిమెంట్స్’ అనే సినిమాతో అపర్ణ మల్లాది దర్శకురాలిగా పరిచయమయ్యారు. ‘పోష్ పోరీస్’ వెబ్‌సిరీస్ ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది. రెండేళ్ల క్రితం ‘పెళ్లి కూతురు పార్టీ’ అనే సినిమాకి దర్శకత్వం వహించారు. కొన్ని సినిమాలకు కథలను అందించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు. అపర్ణ మల్లాది మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
- January 4, 2025
0
280
Less than a minute
Tags:
You can share this post!
administrator

