నిధి అగ‌ర్వాల్ త‌ల్లి నెంబ‌ర్ అడిగిన ఫ్యాన్..

నిధి అగ‌ర్వాల్ త‌ల్లి నెంబ‌ర్ అడిగిన ఫ్యాన్..

హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీ షెడ్యూల్‌తో దూసుకుపోతోంది. ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నిధి, మొదట్లో వరుస అవకాశాలు అందుకున్నప్పటికీ పెద్దగా హిట్లు పడలేదు ఆమెకు. అయితే, పూరి జగన్నాథ్ – రామ్ పోతినేని కాంబినేషన్‌లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా నిధికి మంచి బ్రేక్ అనే చెప్పాలి. ఆ సినిమాలో తన గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత కొన్ని సినిమాలు చేసినా, వాటిలో ఏ సినిమా కూడా నిధి కెరీర్‌కి పెద్ద‌గా ఉప‌యోగ‌ప‌డ‌లేదు. అయితే ఇప్పుడు ఒకేసారి ఇద్దరు పెద్ద హీరోల సినిమాల్లో హీరోయిన్‌గా నటించే ఛాన్స్ కొట్టేసింది. వాటిలో మొదటిది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమాలో నిధి చారిత్రాత్మక పాత్రకు కావలసిన విద్యల్ని నేర్చుకొని త‌న పాత్రలో ఒదిగిపోయింది. గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం వంటి విన్యాసాల‌తో అద‌ర‌గొట్ట‌నుంది. ఇదే కాకుండా, మరో భారీ ప్రాజెక్ట్‌గా ప్రభాస్ – మారుతి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘రాజా సాబ్’ సినిమాలోనూ నిధి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ డబుల్ రోల్‌లో కనిపించనున్నట్టు సమాచారం. ఇటీవలే రిలీజ్ అయిన టీజర్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, తన ఫాలోయర్లతో తరచూ ముచ్చటిస్తూ ఉంటుంది నిధి అగ‌ర్వాల్. ఇటీవల ఓ అభిమాని సరదాగా, ‘‘మీ అమ్మగారి నంబర్ ఇవ్వండి ప్లీజ్. మనం పెళ్లి చేసుకుందాం, ఆ విషయం గురించి మాట్లాడతాను…’’ అని అడిగాడు. దీనికి నిధి నవ్వుతూ “అవునా? నాటీ బాయ్!” అంటూ సరదాగా రిప్లై ఇచ్చింది.

editor

Related Articles