స్విమ్మింగ్ రాక‌పోయినా డేరింగ్ చేసి నీళ్ల‌లోకి దూకా..

స్విమ్మింగ్ రాక‌పోయినా డేరింగ్ చేసి నీళ్ల‌లోకి దూకా..

హీరో సుహాస్ నటిస్తున్న తాజా రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఓ భామ అయ్యో రామ’ సినిమా జులై 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో మలయాళ సినిమా ‘జో’తో ప్రేక్షకుల మనసులు గెల్చుకున్న హీరోయిన్  మాళవిక మనోజ్, తొలిసారి తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్‌ మాళవిక మీడియాతో ముచ్చటిస్తూ తన అనుభవాలను షేర్ చేసింది. తమిళంలో నటించిన ‘జో’ సినిమాలో నా నటనను చూసిన దర్శకుడు రామ్ ఈ సినిమాలో నటించమన్నారు. కథ విన్న వెంటనే నాకెంతో నచ్చింది, అని మాళవిక చెప్పింది. ఈ సినిమాలో ఆమె సత్యభామ పాత్రలో కనిపించబోతోంది. తెలుగు భాష రాకపోయినా, భావాన్ని గ్రహించి తనకు తానుగా నటించిందని మాళవిక చెప్పింది. ఇది నా రియల్ లైఫ్‌కు పూర్తిగా భిన్నమైన పాత్ర. ఎలాంటి హోమ్‌వర్క్‌ చేయలేదు కానీ పాత్రలో లీన‌మ‌య్యాను అని తెలిపింది. ప్రారంభంలో మా పేరెంట్స్, బంధువులు భయపడ్డారు కానీ ఇప్పుడు ట్రైలర్ చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటూ హర్షం వ్యక్తం చేసింది. నాకు స్విమింగ్‌ రాకపోయినా ఈ సినిమాలో ఓ సన్నివేశం కోసం నీళ్ళల్లోకి దూకేసాను. నా పాత్రకు డూప్ చేయాల్సిన అమ్మాయి రాకపోవడంతో షూటింగ్‌ వాయిదా వేయ‌డం ఇష్టం లేక భ‌య‌ప‌డుతూనే దూకేసిన‌ట్టు పేర్కొంది.

editor

Related Articles