నూతన నటీనటులు, సీనియర్ యాక్టర్స్‌తో కలిసి దర్శకుడు గుణశేఖర్ రూపొందిస్తున్న సినిమా ‘యుఫోరియా’. భూమిక, సారా అర్జున్, నాజర్, రోహిత్ తదితరులు ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. శివరాత్రి సందర్భంగా బుధవారం స్పెషల్ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ‘సమకాలీన అంశాలతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాం. నేటి సమాజంలో జరుగుతున్న సంఘటనలకు దర్పణంలా ఉంటుంది. భూమిక పాత్ర భావోద్వేగాలతో సాగుతుంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాకి సంగీతం: కాలభైరవ.
- February 27, 2025
0
109
Less than a minute
Tags:
You can share this post!
administrator


