త్రినాధ్ కఠారి హీరోగా, ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఇట్లు మీ ఎదవ నవంబర్ 21న విడుదలకు సిద్ధమవుతోంది. సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత బళ్లారి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాహితీ అవాంచ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి “వెయ్యేళ్లూ ధర్మంగా వర్ధిల్లు” అనే ట్యాగ్‌లైన్ మంచి ఆకర్షణగా మారింది. తాజాగా విడుదలైన ట్రైలర్‌కు వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ సినిమాపై అంచనాలను పెంచింది. నైజాంలో ఈ సినిమాను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్.ఎల్.పి విడుదల చేయనుండగా, ఆంధ్ర మరియు సీడెడ్ ప్రాంతాల్లో ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ రిలీజ్ చేయనుంది. ఈ రెండు ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో చిత్రం గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్ కీలక పాత్రలు పోషించారు. ఆర్.పి పట్నాయక్ సంగీతం అందించగా, జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ, ఉద్ధవ్ ఎస్.బి ఎడిటింగ్ నిర్వహించారు. యూత్‌ఫుల్ డ్రామా, ఎంటర్‌టైన్‌మెంట్ కలయికగా ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది.
- November 15, 2025
0
52
Less than a minute
You can share this post!
editor

