సనాతన ధ‌ర్మం త్యజించడానికి విద్యే ఆయుధం: క‌మ‌ల్ హాస‌న్

సనాతన ధ‌ర్మం త్యజించడానికి విద్యే ఆయుధం: క‌మ‌ల్ హాస‌న్

స‌నాత‌న ధ‌ర్మంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన రాజ్య‌సభ స‌భ్యుడు కమల్‌హాసన్. సనాతన ధ‌ర్మం సంకెళ్ల‌ను తెంచుకోవ‌డానికి ఉన్న ఏకైక ఆయుధం చ‌దువు మాత్ర‌మేన‌ని తెలిపారు. నటుడు సూర్య స్థాపించిన‌ అగరం ఫౌండేషన్ ఇటీవ‌లే 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ ఫౌండేష‌న్ వ‌ల‌న ఇప్ప‌టివ‌ర‌కు 5,000 మందికి పైగా విద్యార్థులు త‌మ విద్య‌ను పూర్తి చేసుకోగా.. 2,000 మందికి పైగా విద్యార్థులు ప్ర‌స్తుతం చదువుకుంటున్నారు. అయితే ఈ సంస్థ 15వ వార్షికోత్సవాన్ని చెన్నైలో జ‌రుప‌గా.. ఈ వేడుక‌కి ముఖ్య అతిథిగా క‌మ‌ల్ హాస‌న్ వ‌చ్చి మాట్లాడారు. విద్యార్థులను ఉద్దేశించి కమల్ హాసన్ మాట్లాడుతూ.. మీరు ఏ ఆయుధాన్ని చేతిలోకి తీసుకోవద్దు. విద్యను మాత్రమే ఆయుధంగా చేసుకోండి. అది లేకుండా మనం ఎప్ప‌టికీ పైకి ఎదగలేం. మూర్ఖులను ఓడించడానికి చదువు పెద్ద అస్త్రంగా మారుతుందని క‌మ‌ల్ చెప్పుకొచ్చాడు. అలాగే సనాతన ధ‌ర్మం సంకెళ్ల‌ను తెంచుకోవ‌డానికి ఉన్న ఏకైక ఆయుధం చ‌దువు మాత్ర‌మేన‌ని తెలిపాడు. ఈ సందర్భంగా నీట్ పరీక్షపై కూడా క‌మ‌ల్‌ తీవ్ర విమర్శలు చేశాడు. నీట్ పేద విద్యార్థులను వైద్య విద్యను చదువుకోకుండా దూరం చేస్తోందని, అందుకే తాము దానిని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.

editor

Related Articles