తన అన్నయ్య కీరవాణి ప్రోగ్రామ్ కన్సర్ట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు దర్శకుడు రాజమౌళి. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి లైవ్ కన్సర్ట్ చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ‘నా టూర్ ఎం.ఎం.కె’ పేరిట ఈ కన్సర్ట్ చేయనుండగా.. మార్చి 22న సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది. అయితే ఈ వేడుకను సక్సెస్ చేయాలని కోరుతూ ఆయన తమ్ముడు దర్శకుడు రాజమౌళి ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో అభిమానుల నుండి సపోర్ట్‌ను కోరారు. మార్చి 22 కోసం నేను చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాను.

- March 1, 2025
0
16
Less than a minute
Tags:
You can share this post!
editor