బుట్టబొమ్మ పూజా హెగ్డేకు హిట్ అనేది పలకరించి దాదాపు అయిదేళ్లు అవుతోంది. ‘అల వైకుంఠపురం’ తర్వాత ఆమెకు హిట్ లేదు. కానీ అవకాశాలు మాత్రం తలుపు తడుతూనే ఉన్నాయి. పూజా హెగ్డే అందమే అందుకు కారణం కావొచ్చు. ప్రస్తుతం ఈ హీరోయిన్ తమిళ నటుడు విజయ్ చివరి సినిమా ‘జననాయగన్’లో హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే లారెన్స్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న ‘కాంచన 4’ లోనూ ఈ బుట్టబొమ్మే హీరోయిన్. రీసెంట్‌గా సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కూలీ’ సినిమా స్పెషల్ సాంగ్‌లో కూడా పూజాహెగ్డే డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ హీరోయిన్‌ను మరో అద్భుత అవకాశం వెతుక్కుంటూ వచ్చిందట. దుల్కర్ సల్మాన్ తెలుగులో ఓ ప్రేమకథా సినిమాలో నటిస్తున్నారు. నూతన దర్శకుడు హరి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా ఎంపికైనట్టు తెలుస్తోంది. అదే నిజమైతే.. పూజాహెగ్డే రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే సుమా.

- July 15, 2025
0
45
Less than a minute
Tags:
You can share this post!
editor