‘విలువలు’ ముసుగులో కళను చంపొద్దు.. తరుణ్ భాస్కర్

‘విలువలు’ ముసుగులో కళను చంపొద్దు.. తరుణ్ భాస్కర్

హాలీవుడ్ నుండి వ‌చ్చిన సూప‌ర్‌మ్యాన్  సినిమాలోని ప‌లు సన్నివేశాల‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ క‌త్తిరించ‌డంపై టాలీవుడ్ ద‌ర్శ‌కుడు త‌రుణ్‌భాస్క‌ర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ సినిమాలో ఉన్న ముఖ్య‌మైన 33 సెకండ్ల ముద్దు సన్నివేశాన్ని ఇండియన్ వెర్ష‌న్‌లో క‌ట్ చేయించింది సెన్సార్ బోర్డు. దీంతో ఈ విష‌యంపై బాలీవుడ్ న‌టి శ్రేయా ధన్వంతరి ఆగ్రహం వ్యక్తం చేసింది. సూప‌ర్‌మ్యాన్ సినిమాలో ముద్దు స‌న్నివేశం తొల‌గించార‌ని తెలిసింది. ఏం దిక్కుమాలిన చ‌ర్య ఇది. మ‌న‌ల్ని థియేట‌ర్‌కి ర‌మ్మ‌న్ని పైరసీని ఎంక‌రేజ్ చేయ‌వద్ద‌ని సెన్సార్ వాళ్లు కోరతారు. కానీ వాళ్లేమో ఇలాంటి పనికిమాలిన ప‌నులు చేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావ‌డం లేదు. థియేటర్‌కు వెళ్ళే వాళ్లను వెళ్లొద్దని చెప్పడమా ఏమిటో నాకు అర్థం కావడం లేదు, అంత కష్టపడి డైరెక్టర్ సినిమాని తీస్తే వీళ్ల ఆఫ్ నాలెడ్జితో ఎందుకు ఇంత దారుణంగా సెన్సార్ బిహేవ్ చేస్తోంది? మేము ఏం చూడాలనుకుంటున్నామో మమ్మల్ని నిర్ణయించుకోనివ్వండి. మా సమయంతో, మా డబ్బుతో ఏం చేయాలో మాకు తెలుసు, మమ్మల్ని డిసైడ్ చేసుకోనివ్వండి అంటూ శ్రేయా రాసుకొచ్చింది.

editor

Related Articles