టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల సినిమాల కన్నా ఇతర విషయాలలోనే ఎక్కువగా వార్తలలో నిలుస్తోంది. తాజాగా ఆమె ఫాలో అవుతున్న స్ట్రిక్ట్ డైట్ ప్లాన్‌తో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ ర్యాన్ ఫెర్నాండోతో జరిగిన చాట్ సెషన్‌లో సమంత తన ఆహారపు అలవాట్లు ఎంతలా మారాయో చెప్పుకొచ్చింది. గతంలో తాను సన్నగా ఉండడంతో, ఎలాంటి నియమాలు పాటించకుండా అన్నీ తినొచ్చు అనుకునే దానిని. కాని ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని చెప్పారు. తన డైట్‌లో ప్రతిరోజూ ఒకేరకమైన ఆహారాన్ని తీసుకుంటున్నట్టు సమంత వెల్లడించారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా స్మూతీలు, బ్రోకలీ, క్యాలీఫ్లవర్, మొలకలు వంటి పోషకాహార కూరగాయలతో లంచ్, డిన్నర్ తీసుకుంటుందట. సమంత ఏదైనా షూటింగ్ కోసం వెళ్లినప్పుడు తన అసిస్టెంట్‌ను కూడా వెంట తీసుకెళుతుందిట. ఎందుకంటే ఆ అసిస్టెంట్ ఆమెకు స్పెషల్ డైట్‌కు అనుగుణంగా వంటచేసి పెడతారట. ఈ ఆరోగ్యకరమైన ఆహార నియమాలు పాటించడం వలన తాను ఎదుర్కొన్న కొన్ని ఆరోగ్య సమస్యల నుండి బయటపడటానికి ఎంతో సహాయపడ్డాయని కూడా సమంత వెల్లడించారు.

- July 26, 2025
0
40
Less than a minute
Tags:
You can share this post!
editor