తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దర్శకుడు కేకే అలియాస్ కిరణ్ కుమార్ ఆకస్మికంగా కన్నుమూశారు. ఈ వార్త సినీ పరిశ్రమను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. బుధవారం ఆయన మరణించినట్లు తాజాగా ఆయన దర్శకత్వం వహించిన ‘కింగ్ జాకీ క్వీన్ ’ సినిమా టీం అధికారికంగా ప్రకటించింది. అయితే ఆయన మరణానికి గల కారణాలు ఇప్పటివరకు వెల్లడించలేదు. కెరీర్‌లో కొత్త మలుపులు తిరుగుతున్న సమయంలోనే ఆయన ఇలా ఆకస్మికంగా మరణించడం పట్ల సినీ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. చాలా గ్యాప్ తర్వాత మరి కొద్దిరోజుల్లోనే కేకే డైరెక్షన్ చేసిన సినిమా రిలీజ్ కాబోతున్న తరుణంలో అనూహ్యంగా ఇలా జరగడం సర్వత్రా విషాదం నింపుతోంది. కాగా కిరణ్‌కుమార్ తన కెరీర్‌ను ‘కేడీ’ చిత్రంతో దర్శకుడిగా ప్రారంభించారు. ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడంతో ఆయన కొంతకాలం దర్శకత్వానికి విరామం తీసుకున్నారు. అనంతరం అగ్ర దర్శకుడు మణిరత్నం వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశారు. మణిరత్నం దర్శకత్వం వహించిన పలు చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా ఆయన పనిచేశారు. అలానే కేవలం దర్శకుడి గానే కాకుండా ఇటీవల నటుడిగా కూడా రూట్ మార్చారు. విజయ్ ఆంటోనీ నటించిన ‘భద్రకాళి’ సినిమాలో సీబీఐ ఆఫీసర్ పాత్రలో కనిపించి మెప్పించారు. అయితే ఒక వైపు దర్శకత్వం.. మరోవైపు నటుడిగా బిజీ అవుతుండగా ఊహించని రీతిలో ఈ విషాదం చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
- December 17, 2025
0
14
Less than a minute
You can share this post!
editor


